సుధీర్ బాబు సరసన కన్నడ హీరోయిన్ !

సుధీర్ బాబు సరసన కన్నడ హీరోయిన్ !

Published on Oct 23, 2017 6:45 PM IST

హీరో సుధీర్ బాబు త్వరలోనే ఒక సినిమా ప్రారంభించనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఉండనుంది. ఈ సినిమాను రాజశేఖర్ నాయుడు డైరెక్ట్ చేయనున్నాడు. ఈ చిత్రంలో సుధీర్ బాబుకు జోడీగా కన్నడ హీరోయిన్ ను ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది. ఆమే నాభ నతేష్.

ఈమె రవిబాబు చేస్తున్న ‘అదుగో’ చిత్రంలో కూడా నటిస్తుండటం విశేషం. రాజశేఖర్ చెప్పిన కథ , హీరోయిన్ పాత్ర నచ్చడంతో ఆమె వెంటనే ఓకే చెప్పేశారట. ఈ సినిమా రెగ్యులర్ షూట్ ఎప్పుడు మొదలవుతుంది, ఇతర తారాగణం ఎవరు అనే వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. ఇకపోతే సుధీర్ బాబు పుల్లెల గోపిచంద్ బయోపిక్ కు సైతం సిద్ధమవుతున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు