అల్లు అర్జున్ సినిమాలో కన్నడ సూపర్ స్టార్.!

అల్లు అర్జున్ సినిమాలో కన్నడ సూపర్ స్టార్.!

Published on Sep 19, 2014 1:30 PM IST

allu-arjun-upendra
బ్లాక్ బస్టర్ హిట్ ‘రేసు గుర్రం’ సినిమా తర్వాత బాగా గప్ తీసుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ఓ సినిమా చేస్తున్న సంగతి ఇదివరకే తెలియజేశాం. చాలా కాలం క్రితమే ప్రారంభమైన ఈ సినిమా ఎట్టకేలకు సెప్టెంబర్ 22 నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో అల్లు అర్జున్ తో పాటు కన్నడ సూపర్ స్టార్ అయిన ఉపేంద్ర ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు.

ఇది వరకూ ఈ సినిమాలో ఓ పాత్ర కోసం అర్జున్ ని అనుకున్నారు కానీ ప్రస్తుతం ఉపేంద్రని అనుకుంటున్నారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన 3 హీరోయిన్స్ కనిపిస్తారు. అందులో ఇప్పటికే సమంత, ఆద శర్మ ఖరారైంది. మరో హీరోయిన్ కోసం అన్వేషిస్తున్నారు. వీరందరూ కాకుండా స్నేహ కూడా ఓ ముఖ్య పాత్రలో కనిపించనుంది.

అల్లు అర్జున్ – త్రివిక్రమ్ కాంబినేషన్ లో ‘జులాయి’ సినిమాని మనకు అందించిన కె. రాధాకృష్ణ నిర్మించనున్న ఈ సినిమాకి దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించనున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు