సూర్యని డైరెక్ట్ చేయాలనుకుంటున్న కార్తి !

హీరో సూర్య, ఆయన తమ్ముడు కార్తి ఇద్దరు కూడా తమిళంతో పాటు తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నారు. ఈమధ్యే కార్తి నటించిన ‘ఖాకి’ మంచి విజయాన్ని సాధించి ఆయనకు బ్రేక్ ను అందించింది. ఈ సందర్బంగా అభిమానులతో సోషల్ మీడియాలో మాట్లాడిన కార్తి తన మనసులోని కోరికను బయటపెట్టారు.

ఇంతకీ ఆ కోరిక ఏమిటనుకుంటున్నారా అదే తన అన్న సూర్యను డైరెక్ట్ చేయడం. హీరో కాకముందు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసేప్పుడు అన్న సూర్త్య కోసం ఒక స్క్రిప్ట్ రాసుకున్నానని, దాంతో అన్నను ఇంప్రెస్ చేసి, సినిమా చేస్తానో లేదో చూడాలి అని అన్నారు. మరి కార్తి సూర్య కోసం ఎలాంటి స్క్రిప్ట్ రాశారో, అది సూర్యకు నచ్చి తనను డైరెక్ట్ చేసే అవకాశం తమ్ముడికి ఇస్తారో లేదో చూడాలి.

 

Like us on Facebook