డేర్ డెవిల్ స్టంట్స్ చేసిన కార్తిక – అల్లరి నరేష్

డేర్ డెవిల్ స్టంట్స్ చేసిన కార్తిక – అల్లరి నరేష్

Published on Oct 2, 2014 12:15 AM IST

allari-naresh-karthika

అల్లరి నరేష్, కార్తిక కవలలుగా నటించిన చితం ‘బ్రదర్ అఫ్ బొమ్మాళీ’. ఇటివల విడుదలైన ఈ చిత్రం ఫస్ట్ లుక్ ప్రేక్షకులలో సినిమాపై ఆసక్తిని కలిగించింది. ఈ చిత్రంలో కార్తిక ఎటువంటి డూప్ సహాయం లేకుండా డేర్ డెవిల్ స్టంట్స్ ను చేసిందని హీరో నరేష్ తెలిపారు. ఆమె తప్ప మరొకరు ఆ పాత్రను అంత ఎఫెక్టివ్ గా, అద్బుతంగా చేయలేరు. కార్తిక పాత్ర టామ్ బాయ్ తరహాలో ఉంటుంది. సినిమా పట్ల ఆమె కమిట్మెంట్ చూసి ఆశ్చర్యపోయాను అని కార్తికపై అల్లరి నరేష్ పొగడ్తల వర్షం కురిపించాడు.

‘వీడు తేడా’ ఫేం చిన్ని కృష్ణ దర్శకత్వం వహించిన ఈ ‘బ్రదర్ అఫ్ బొమ్మాళీ’ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈవివి సత్యనారాయణ సమర్పణలో అమ్మిరాజు ఈ చిత్రాన్ని నిర్మించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు