నరేష్ సోదరిగా కార్తీక ఎంపిక పర్ఫెక్ట్ – చిన్ని

నరేష్ సోదరిగా కార్తీక ఎంపిక పర్ఫెక్ట్ – చిన్ని

Published on Sep 13, 2014 3:30 PM IST

allari_naresh_karthika
కార్తీక ప్రస్తుతం అల్లరి నరేష్ సోదరిగా ‘బ్రదర్ ఆఫ్ బొమ్మాళి’ సినిమాలో నటిస్తుంది. ఆ సినిమాలో ఈ భామ పెర్ఫార్మెన్స్ కు దర్శకుడు చిన్ని కృష్ణ ప్రశంసల జల్లుని కురిపించాడు

కార్తీక గురించి దర్శకుడు మాట్లాడుతూ “నరేష్ సోదరిగా ఎవరు బాగుంటారు అని ఆలోచిస్తున్న తరుణంలో నరేష్ కార్తీక పేరు సజెస్ట్ చేసాడు. మేము వెంటనే ఆమెను సంప్రదించాం. ఆమె నటించిన నటన మమ్మల్ని ఆశ్చర్యపరిచింది. సినిమాలో ప్రధాన పాత్రలైన వీరిమధ్య సెంటిమెంట్ సమపాళ్లలో పండి ప్రేక్షకులని ఎంటర్టైన్ చేస్తాయి” అని తెలిపాడు

ఈ సినిమా ఆడియోని ఈ నెలలో విడుదలచేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. హర్షవర్ధన్ రాణే ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు

సంబంధిత సమాచారం

తాజా వార్తలు