విడుదలకు ముందు అంచానాలు పెంచుకుంటున్న కార్తికేయ

విడుదలకు ముందు అంచానాలు పెంచుకుంటున్న కార్తికేయ

Published on Oct 22, 2014 5:00 PM IST

karthikeya1
కెరీర్ లో డల్ ఫేజ్ లో సాగుతున్న తరుణంలో నిఖిల్ కు ‘స్వామి రారా’ రూపంలో మంచి విజయం అందింది. తనకు ఎటువంటి సినిమాలు సరిపోతాయో సరిగ్గా తెలుసుకుని ఇకనుండి అటువంటి చిత్రాలపై దృష్టిపెట్టనున్నాడు. ప్రస్తుతం ఒక సరికొత్త కాన్సెప్ట్ తో ‘కార్తికేయ’ సినిమా ద్వారా మనముందుకు రానున్నాడు

ఈ సినిమా ట్రైలర్ సినీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.సినిమాలో నటీనటులు చిత్ర విజయం పై ధీమా వ్యక్తంచేస్తున్నారు. ఈ వారాంతరం ఎలాగో తెలుగులో పెద్ద సినిమాలేమి లేని తరుణంలో కార్తికేయ ప్రేక్షకులను అలరించగలిగితే మంచి విజయం సాధించే అవకాశం వుంది. చందూ మొందేటి ఈ సినిమాకు దర్శకుడు. వెంకట శ్రీనివాస్ నిర్మాత. కలర్స్ స్వాతి ఈ సినిమాలో హీరోయిన్

సంబంధిత సమాచారం

తాజా వార్తలు