కార్తీ ‘కాష్మోరా’ బడ్జెట్ ఎంతో తెలుసా..?

కార్తీ ‘కాష్మోరా’ బడ్జెట్ ఎంతో తెలుసా..?

Published on Oct 26, 2016 7:56 PM IST

kaasamora-1
తమిళ స్టార్ హీరో కార్తీ నటించిన భారీ బడ్జెట్ ఫాంటసీ థ్రిల్లర్ కాష్మోరా ఈ శుక్రవారమే (అక్టోబర్ 28న) ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పటికే అన్ని కార్యక్రమాలనూ పూర్తి చేసుకున్న ఈ సినిమా నేటితో సెన్సార్ కూడా పూర్తి చేసుకొని పక్కాగా విడుదలకు సిద్ధమైంది. సెన్సార్ బృందం ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. తమిళంతో పాటు తెలుగులోనూ కార్తీకి ఉన్న ఫాలోయింగ్ దృష్ట్యా రెండు భాషల్లో ఈ సినిమా 2000లకు పైగా థియేటర్లలో విడుదలవుతోంది. ఇక ఇప్పటికే తారాస్థాయిలో ఉన్న అంచనాల మధ్యన విడుదలవుతోన్న ఈ సినిమాను ప్రేక్షకులకు మరింత చేరువయ్యేలా టీమ్ చేపట్టిన ప్రమోషన్స్ కూడా భారీ స్థాయిలో ఉన్నాయి.

ఈ ప్రమోషన్స్‌లో భాగంగానే టీమ్ సినిమాకు అయిన బడ్జెట్ ఎంతో తెలిపింది. సుమారు 55 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కిందట. కార్తీ కెరీర్‌లో ఇదే భారీ బడ్జెట్ సినిమా కావడాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాలి. గోకుల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కార్తీ మూడు డిఫరెంట్ రోల్స్‌లో ఆకట్టుకోనున్నారు. కార్తీ సరసన నయనతార, శ్రీదివ్య హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను పీవీపీ సినిమా తెలుగులో విడుదల చేస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు