బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న ‘ఖాకి’ !

తమిళంతో పాటు తెలుగులో కూడా మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు కార్తి తాజా చిత్రం ‘ఖాకి’ గత శుక్రవారం విడుదలై మంచి మౌత్ టాక్ తో నడుస్తోంది. మొదటి రోజే మంచి సినిమా అనే పేరు తెచ్చుకున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద గత వారం విడుదలైన అన్ని సినిమాల్లోకి మెరుగ్గా పెర్ఫార్మ్ చేస్తోంది.

ఎలాంటి అనవసరామైన అంశాలకు తావివ్వకుండా దర్శకుడు వినోత్ వాస్తవంగా జరిగిన ఒక కేసులో పూర్తిస్థాయి పరిశోధన జరిపి రాసిన కథ, కథనాలు, సహజత్వానికి దగ్గరగా ఉండే పోరాట సన్నివేశాలు, రకుల్, కార్తిల రొమాంటిక్ ట్రాక్, మొదటిసారి పోలీస్ పాత్రలో కనబడుతూ కార్తి ప్రదర్శించిన భావోద్వేగపూరితమైన నటన విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అలాగే జిబ్రాన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకు మరింతగా కలిసొచ్చింది.

 

Like us on Facebook