కాటమరాయుడు మీదే పూర్తి దృష్టి పెట్టిన పవన్ కళ్యాణ్ !

katamarayudu
కాటమరాయుడు చిత్ర షూటింగ్ ని పూర్తి చేయడం పైనే పవన్ దృష్టి సారించినట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ పొల్లాచ్చి లో శరవేగంగా జరుగుతోంది.పవన్ తన పొలిటికల్ కెరీర్ పై దృష్టి సారించేందుకు తాను కమిటైన అన్ని చిత్రాలను త్వరగా పూర్తి చేసే ఆలోచనలో ఉన్నాడు.

తాజా సమాచారం ప్రకారం మిగిలి ఉన్న అన్ని సన్నివేశాల్ని త్వరగా పూర్తి చేయడానికి పవన్ చిత్ర బృందం తో పాటు కష్టపడుతున్నట్లు తెలుస్తోంది. పవన్ తో సహా కొందరి కీలక నటులపై చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రం లో పవన్ సరసన శృతి హాసన్ నటిస్తుండగా డాలి దర్శకత్వం వహిస్తున్నాడు. శరత్ మరార్ నిర్మాత.

 

Like us on Facebook