‘కాటమరాయుడు’ టీజర్ విడుదల వాయిదా!

‘కాటమరాయుడు’ టీజర్ విడుదల వాయిదా!

Published on Jan 23, 2017 8:24 AM IST

katamarayudu
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తోన్న ‘కాటమరాయుడు’ అనే సినిమా కొద్ది నెలలుగా నిరంతరాయంగా షూటింగ్ జరుపుకుంటూ వస్తోన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమా మార్చి నెలాఖర్లో విడుదలకు సిద్ధమవుతోంది. ఇక గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26న ఫస్ట్ టీజర్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించిన టీమ్, తాజాగా టీజర్ విడుదలను వాయిదా వేసింది. కొత్త తేదీని కూడా ఇంకా నిర్ణయించలేదని, త్వరలోనే టీజర్ ఎప్పుడు విడుదల చేయనున్నది ప్రకటిస్తామని టీమ్ తెలిపింది.

నిజానికి సంక్రాంతికే ఈ టీజర్ విడుదలవుతుందనుకున్నా, అది కాస్తా జనవరి 26కు వాయిదా పడింది. ఇప్పుడు జనవరి 26న కూడా టీజర్ విడుదల కాకపోవడం అభిమానులను నిరుత్సాహపరచే అంశం. డాలీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా తమిళంలో మంచి విజయం సాధించిన వీరంకి రీమేక్‌గా ప్రచారం పొందుతోంది. పవన్ సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాను నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై శరత్ మరార్ నిర్మిస్తున్నారు

సంబంధిత సమాచారం

తాజా వార్తలు