‘కాటమరాయుడు’ టైటిల్ సాంగ్ రిలీజ్ !
Published on Mar 2, 2017 6:47 pm IST


పవర్ స్టార్ అభిమానులు ఎంతో ఆతురతగా ఎదురుచూస్తున్న సమయం దగ్గరపడుతోంది. మార్చి 24న ‘కాటమరాయుడు’ రిలీజుకు సిద్ధమవుతోంది. ఈ లోపు ఫ్యాన్స్ కు కొన్ని బహుమతులున్నట్టు రాయుడు టీమ్ ఇక నుండి వరుసగా రిలీజ్ వరకు సర్ప్రైజ్ లు ఇవ్వనుంది. కొన్ని రోజుల క్రితమే పవర్ ఫుల్ టీజర్ రిలీజ్ చేసి అభిమానుల్ని ఖుషీ చేసిన టీమ్ రేపు మరో పెద్ద బహుమతిని ప్లాన్ చేసింది. అదే టైటిల్ సాంగ్ రిలీజ్. మెగా ఫ్యామిలీ కొత్త సాంప్రదాయం ప్రకారం ఆడియో కార్యక్రమం నిర్వహించకుండా పాటలను ఒక్కొక్కటిగా రిలీజ్ చేయాలని భావించిన నిర్మాతలు రేపు టైటిల్ సాంగ్ ను విడుదల చేయనున్నారు.

ఈ వార్తతో అభిమానుల్లో ఇప్పటి నుండే సందడి మొదలైంది. అలా పాటలను ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తూనే మార్చి 14న గ్రాండ్ గా ప్రీ రిలీజ్ వేడుకను కూడా నిర్వహించనున్నారు. ఈ వరుస విశేషాలతో మార్చి నెల మొత్తం పవన్ అభిమానులకు పండుగలా మారనుంది. ఇకపోతే పవన్ ఈ ఏడాది ఈ సినిమా కాకుండా త్రివిక్రమ్, ఆర్టీ నీసన్ లతో రెండు సినిమాలను చేయనున్నాడు.

 
Like us on Facebook