ఓవర్సీస్లో ‘కాటమరాయుడు’ కి కష్టాలు తప్పేలా లేవు !

ఓవర్సీస్లో ‘కాటమరాయుడు’ కి కష్టాలు తప్పేలా లేవు !

Published on Mar 27, 2017 6:16 PM IST


పవన్ కళ్యాణ్ నటించిన ‘కాటమరాయుడు’ చిత్రం లోకల్ ఏరియాలతో పాటు ఓవర్సీస్లో సైతం భారీ ధరకు అమ్ముడైంది. పవన్ కళ్యాణ్ క్రేజ్ మీదున్న నమ్మకంతో డిస్ట్రిబ్యూటర్లు భారీ మొత్తాన్ని వెచ్చించి హక్కుల్ని కొన్నారు. కొన్నవారి టార్గెట్ ప్రకారం సినిమా మొదటి రోజు ఓపెనింగ్స్ తోనే సగం మొత్తం వెనక్కు రావాలి కానీ ‘కాటమరాయుడు’ ఆ మార్క్ ను అందుకోలేకపోయింది. పవన్ గత చిత్రం ‘సర్దార్ గబ్బర్ సింగ్’ తో పోలిస్తే రాయుడు వసూలు చేసింది తక్కువే. ఇక నిన్నటి వరకు లెక్కలు చూస్తే ఈ చిత్రం మిలియన్ డాలర్ క్లబ్లోకి ఎంటరైంది.

అంటే దాదాపుగా రూ. 6 కోట్లు వసూలు చేసింది. సినిమాను కొన్నది రూ. 11. 5 కోట్లకు. దానికి ప్రచార హక్కుల్ని కూడా కలిపితే ఆ మొత్తం రూ. 12 కోట్లను చేరింది. రూ. 12 కోట్లలో వసూలైన రూ. 6 కోట్లు పక్కనబెడితే ఇంకో రూ. 6 కోట్లు వెనక్కు రావాలి. సినిమాలో కుటుంబ ప్రేక్షకులను మెప్పించే కంటెంట్ లేకపోవడం, ఆరంభంలోనే మిక్స్డ్ రెస్పాన్స్ రావడం, రాబోయేవి వీక్ డేస్ కావడంతో ఈ చిత్రం అతి కష్టం మీద ఇంకో రూ. 1. 5 నుండి 2 కోట్ల వరకు రాబట్టవచ్చు. సో మొత్తం మీద చూస్తే కొన్న డిస్ట్రిబ్యూటర్ కు భారీ నష్టాలు తప్పేలా లేవు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు