ఆందోళనకారుల ఒత్తిడికి తలొగ్గిన హీరో విజయ్ & ‘కత్తి’ నిర్మాతలు.

ఆందోళనకారుల ఒత్తిడికి తలొగ్గిన హీరో విజయ్ & ‘కత్తి’ నిర్మాతలు.

Published on Oct 21, 2014 2:40 PM IST

kaththi
ఇళయ దళపతి విజయ్ హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో నటించిన సినిమా ‘కత్తి’. దీపావళి కానుకగా ఈ సినిమా రేపు, అక్టోబర్ 22న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సినిమాను నిర్మించిన లైకా ప్రొడక్షన్స్ సంస్థకు శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని సినిమా ప్రారంభం నుండి ఆరోపణలు వస్తున్నాయి.

సినిమా బ్యానర్ నుండి లైకా పేరు తొలగించకపోతే విడుదల అడ్డుకుంటామని గత కొన్ని రోజులుగా తమిళ సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. నిర్మాతలు వెనక్కి తగ్గకపోవడంతో సోమవారం రాత్రి నుండి ఆందోళన మరింత ఉధృతం చేశారు. తమిళనాడులో రాష్ట్రవ్యాప్తంగా థియేటర్ల వద్ద ఆందోళన చేపట్టారు. చెన్నైలో పలు సినిమా థియేటర్లపై ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. ఈ దాడిలో మూడు థియేటర్లు ధ్వంసమయ్యాయి.

విడుదలకు ఒక్క రోజు ముందు వివాదం తీవ్ర రూపం దాల్చడంతో హీరో విజయ్, నిర్మాతలు ఒక మెట్టు దిగి రాక తప్పలేదు. బ్యానర్ నుండి లైకా ప్రొడక్షన్స్ పేరు తొలగిస్తామని, అమ్మ జయలలితకు కృతజ్ఞతలు తెలుపుతూ నిర్మాతలు ఒక పత్రికా ప్రకటన విడుదల చేస్తారని విజయ్ మీడియాకు తెలిపారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు