‘కత్తి’ హీరోయిన్ సనా ఖాన్ అరెస్ట్..

‘కత్తి’ హీరోయిన్ సనా ఖాన్ అరెస్ట్..

Published on Oct 30, 2014 5:38 PM IST

Sana-Khan
‘కళ్యాణ్ రామ్ కత్తి’, మంచు మనోజ్ ‘మిస్టర్ నూకయ్య’ సినిమాలలో నటించింది సనా ఖాన్. తెలుగులో పెద్దగా గుర్తింపు రాకపోవడంతో బాలీవుడ్ చెక్కేసింది. అక్కడ బిగ్ బాస్ రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేయడంతో పాటు సల్మాన్ ఖాన్ ‘జై హో’ సినిమాలో నటించి మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. సినిమా వార్తల కంటే ఇతర గొడవలతో అమ్మడు ఎప్పుడూ మీడియా కంట్లో పడుతుంది.

ఒక మీడియా జర్నలిస్ట్ ను బెదిరించిన కేసులో హీరోయిన్ సనా ఖాన్ మరియు ఆమె బాయ్ ఫ్రెండ్ ఇస్మాయిల్ ఖాన్ లను ఈ రోజు ఉదయం ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. తర్వాత కోర్టులో వీరిని హాజరుపరచగా బెయిల్ మంజూరు అయ్యింది. సనా ఖాన్ గొడవలలో ఇరుక్కోవడం ఇది మొదటసారి కాదు. గత ఏడాది మే నెలలో తన సోదరుడి పెళ్లి ప్రపోజల్ ను రిజెక్ట్ చేసిందనే నెపంతో 15 ఏళ్ళ యువతిని కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించిన ఘటనలో కేసు నమోదు అయ్యింది. ఆ కేసులో ముందస్తు బెయిల్ తీసుకుంది. ముందస్తు బెయిల్ ఎలా వచ్చింది..? అని ప్రశ్నిస్తూ చేస్తూ ముంబైకి చెందిన ఒక జర్నలిస్ట్ పూనమ్ ఖన్నా సనా, ఇస్మాయిల్ ల బంధం గురించి న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ రాశారు. తమ ఎఫైర్ లీక్ కావడానికి ముఖ్య కారణమైన సదరు జర్నలిస్ట్ ను బెదిరించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు