‘కత్తి’ రిలీజ్ కి గ్రీన్ సిగ్నల్

‘కత్తి’ రిలీజ్ కి గ్రీన్ సిగ్నల్

Published on Oct 21, 2014 5:53 PM IST

kathi
తమిళ స్టార్ హీరో విజయ్ హీరోగా, అందాల భామ సమంత హీరోయిన్ గా నటించిన సినిమా ‘కత్తి’. ఈ సినిమా దీపావళి కానుకగా రేపు విడుదల కావాల్సి ఉంది. కానీ గత మూడు రోజులుగా ఈ సినిమా రిలీజ్ విషయంలో ఓ గందరగోళం నెలకొంది. ఈ సినిమా నిర్మాతలలో ఒకరైన లైకా ప్రొడక్షన్ వారు శ్రీ లంకకి చెందిన వారు కావడం వలన ముందుగా రిలీజ్ ఆపేయాలని గవర్నమెంట్ డిమాండ్ చేసింది.

ఫైనల్ గా నిర్మాతలు – థియేటర్ ఓనర్స్ – గవర్నమెంట్ అధికారులంతా కూర్చొని చర్చించిన తర్వాత నిర్మాతలు లైకా ప్రొడక్షన్స్ వారికి అంతా సెటిల్ చేసి వారి లోగోని తొలగించడానికి సిద్దమయ్యారు. దాంతో సినిమా రిలీజ్ కి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. షో వెయ్యకూడదని పోలీసులు కూడా ఈ సమస్య క్లియర్ అయ్యేంత వరకూ థియేటర్ దగ్గర ఉన్నారు. కానీ గవర్నమెంట్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో అభిమానులో ఆనందంలో మునిగిపోయారు. ఎఆర్ మురుగదాస్ డైరెక్ట్ చేసిన హై వోల్టేజ్ ఎంటర్టైనర్ కి అనిరుధ్ మ్యూజిక్ అందించాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు