బన్నీ కలల ప్రాజెక్టులో హీరోయిన్ ఎవరో తెలుసా ?

keeti-suresh

‘రేసు గుర్రం, సన్ ఆఫ్ సత్యమూర్తి, సరైనోడు’ వంటి విజయాలతో చాలా వేగంగా టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరిగా నిలిచిన హీరో అల్లు అర్జున్. ఈయనకు తెలుగునాటే కాక కేరళ, కర్ణాటకలో కూడా మంచి ఫ్యాన్ బేస్ ఉంది. కేవలం ఒక్క భాషకే పరిమితం కాకుండా దక్షిణాదిలో ఉన్న అన్ని భాషల సినీ పరిశ్రమల్లో తన మార్క్ చూపించడానికి ప్రయత్నిస్తున్నాడు బన్నీ. అందుకే తమిళ దర్శకుడు లింగు స్వామితో కలిసి కోలీవుడ్ లో సినిమాని మొదలుపెట్టాడు.

ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరు నటిస్తారనే ఆసక్తికరమైన అంశం పై ఇప్పుడు చర్చ నడుస్తోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఇందులో తమిళ టాప్ హీరోయిన్లలో ఒకరైన కీర్తి సురేశ్ నటిస్తుందని వార్తలు వసున్నాయి. కానీ ఈ విషయంపై చిత్ర యూనిట్ నుండి ఇంకా ఎటువంటి వివరణా రాలేదు. తెలుగులో ‘నేను శైలజా’ చిత్రంలో నటించిన ఈమె తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్టింది. కానీ ఆ తరువాత తెలుగులో పెద్ద ఆఫర్లు చాలానే వచ్చినా వాటన్నింటనీ పక్కనబెట్టి కోలీవుడ్ లో నటిస్తూ దూసుకుపోతోంది. ఇకపోతే ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ ‘స్టూడియో గ్రీన్’ నిర్మిస్తోంది.

 

Like us on Facebook