50 లుక్ టెస్ట్స్ చేయించుకున్న కీర్తి సురేష్

50 లుక్ టెస్ట్స్ చేయించుకున్న కీర్తి సురేష్

Published on Oct 21, 2019 10:29 AM IST

‘మహానటి’ చిత్రంతో తనలోని నటిని పూర్తి స్థాయిలో ఆవిష్కరించి గొప్ప పేరు తెచ్చుకుంది కీర్తి సురేష్. ఈ సినిమా ఇచ్చిన క్రేజ్ కారణంగా ఆమెకు అలాంటి లేడీ ఓరియెంటెడ్ సినిమా ఆఫర్లు చాలానే వచ్చాయి. వాటిలో ‘మిస్ ఇండియా’ కూడా ఒకటి. ఈ సినిమా కోసం కీర్తి చాలానే కష్టపడింది. సినిమాలో డిఫరెంట్ టైమ్ పిరియడ్స్ లో డిఫరెంట్ లుక్స్ లో కనిపించాల్సి ఉండటంతో బరువు తగ్గిన ఆమె ఆ లుక్స్ కోసం అనేక లుక్ టెస్ట్స్ చేయించుకుందట.

ఒక్కో లుక్ కోసం కనీసం 10 టెస్ట్స్ చేశారని.. అలా మొత్తం 50కి పైగా లుక్ టెస్ట్స్ జరిగాయని, అన్నిటిలోనూ కీర్తి సురేష్ చాలా ఓపిగ్గా పాల్గొందని, సినిమాలో ఆమె లుక్స్ చాలా గొప్పగా ఉంటాయని, పాత్రలో కీర్తి సురేష్ ఇట్టే ఒదిగిపోవడం చూసి ఆశ్చర్యం వేసిందని దర్శకుడు నరేంద్ర నాథ్ చెప్పుకొచ్చారు. ఇంత ఎఫర్ట్ పెట్టి చేస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొని ఉంది.

ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై మహేష్ కోనేరు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో నవీన్ చంద్ర, జగపతిబాబు, నరేష్, రాజేంద్ర ప్రసాద్ తదితరులు కీలక పాత్రలు చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు