Like us on Facebook
 
రిలీజుకు ముందే రికార్డులు సృష్టిస్తున్న మెగాస్టార్ !

khaidi150-1
మెగాస్టార్ చిరంజీవి దాదాపు 8 ఏళ్ల తరువాత రీ ఎంట్రీ ఇస్తూ చేసిన సినిమా ‘ఖైదీ నెం 150’. ఈ సినిమాతో చిరు ఇండస్ట్రీలోని పాత రికార్డుల్ని కొల్లగొట్టి కొత్త రికార్డుల్ని క్రియేట్ చేస్తాడని మెగా అభిమానులు బోలెడు అంచనాలను పెట్టుకున్నారు. వాళ్ళ అంచనాలను మించిపోతూ ఖైదీ చిత్రం రిలీజుకు ముందే రికార్డులు సృష్టిస్తోంది. తాజాగా రెండు రోజుల క్రితం విడుదలైన ఈ సినిమా తాలూకు పాట ‘అమ్మడు లెట్స్ డు కుమ్ముడు’ ఇప్పటి వరకూ 3 మిలియన్ల వ్యూస్ సాదించి తక్కువ టైమ్ లో ఎక్కువ వ్యూస్ పొందిన పాటగా రికార్డ్ క్రియేట్ చేసి టాప్ 5 లో 3వ స్థానంలో నిలిచింది.

మరోవైపు కొద్ది రోజుల క్రితమే విడుదలైన టీజర్ కూడా ఇప్పటికీ జోరు తగ్గకుండా యూట్యూబ్ లో దూసుకుపోతోంది. చిరంజీవి స్టైలిష్ లుక్, పంచ్ డైలాగ్, ఫైట్ సీన్ అన్నీ కలిపి ఉన్న టీజర్ అభిమానులకు కనులపండుగ చేసింది. ఇప్పటిదాకా ఈ వీడియోను 5.8 మిలియన్ల మంది వీక్షించారు. ఈ ప్రీ రిలీజ్ రికార్డులతో చిరు తన స్టామినా, స్టార్ డమ్ ఏమాత్రం తగ్గలేదని నిరూపించాడు. ఈ రికార్డులతో ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఊపందుకుంది. 2017 జనవరి 12న రిలీజ్ కానున్న ఈ సినిమాలో కాజల్ హీరోయిన్ గా నటిస్తుండగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒక పాటలో మెరవనున్నాడు.

Bookmark and Share