విలన్‌తో తలపడుతోన్న ‘ఖైదీ నెం. 150’!

విలన్‌తో తలపడుతోన్న ‘ఖైదీ నెం. 150’!

Published on Sep 30, 2016 10:05 AM IST

khiadi-150-villain-chiru
మెగా స్టార్ చిరంజీవి రీ ఎంట్రీ సినిమా అయిన ‘ఖైదీ నెం. 150’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న విషయం తెలిసిందే. వీవీ వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో చిరు తనయుడు రామ్ చరణ్ స్వయంగా నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా విడుదల కానున్న ఈ సినిమా కోసం అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక అనుకున్న తేదీకే సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చేయాలన్న ఉద్దేశంతో టీమ్ శరవేగంగా షూటింగ్ పూర్తి చేస్తోంది.

ప్రస్తుతం హీరో చిరంజీవి, విలన్ తరుణ్ అరోరాల మధ్యన ఆసక్తికర ఛాలెంజింగ్ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఈ సన్నివేశాల్లో చిరు హీరోయిజం అదిరిపోయేలా ఉంటుందని టీమ్ చెబుతోంది. తమిళంలో ఘన విజయం సాధించిన ‘కత్తి’కి రీమేక్‌గా తెరకెక్కుతోన్న ‘ఖైదీ నెం. 150’ని లైకా ప్రొడక్షన్స్‌తో కలిసి రామ్ చరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. చిరు సరసన కాజల్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్నారు. రైతుల సమస్యలను స్పృశించే ఓ బలమైన కథతో సినిమా తెరకెక్కుతోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు