‘ఖైదీ నెం. 150’ టీజర్‌కు ముహూర్తం పెట్టేశారు!

‘ఖైదీ నెం. 150’ టీజర్‌కు ముహూర్తం పెట్టేశారు!

Published on Dec 8, 2016 12:13 PM IST

khaidi150
మెగాస్టార్ చిరంజీవి చాలాకాలం తర్వాత సినిమాలకు రీ ఎంట్రీ ఇస్తూ చేసిన సినిమా ‘ఖైదీ నెం. 150’ కోసం అభిమానులంతా ఎంతగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ అన్నీ అంచనాలను అంతకంతకూ పెంచేస్తూ వెళుతున్నాయి. ఇక ఈ నేపథ్యంలోనే అభిమానుల ఉత్సాహాన్ని అలాగే కొనసాగించాలన్న ఉద్దేశంతో నేడు (డిసెంబర్ 8న) టీజర్‌ను విడుదల చేయనున్నట్లు తెలిపిన టీమ్, తాజాగా టైమ్‌ను కూడా ఫిక్స్ చేసేసింది. మొదట అర్థరాత్రి పన్నెండు గంటలకు విడుదల చేయాలని భావించినా, చివరకు సాయంత్రం 6 గంటలకు టీజర్‌కు టైమ్ ఫిక్స్ చేశారు.

ఈ సాయంత్రం ఆరు గంటల నుండి చిరంజీవి సోషల్ మీడియాలో దుమ్మురేపుతారనే చెప్పొచ్చు. చిరంజీవి స్క్రీన్‌పై ఎలా ఉంటారో అంటూ ఎదురుచూస్తోన్న అభిమానులకు ఇప్పుడీ టీజర్ చిన్న పరిచయ వీడియోగా ఉత్సాహానివ్వనుంది. చిరు తనయుడు రాం చరణ్ నిర్మించిన ఈ సినిమాకు వీవీ వినాయక్ దర్శకత్వం వహించారు. జనవరి 11న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా తమిళంలో ఘన విజయం సాధించిన ‘కత్తి’కి రీమేక్!

సంబంధిత సమాచారం

తాజా వార్తలు