‘ఖైదీ నంబర్ 150’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్!

‘ఖైదీ నంబర్ 150’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్!

Published on Jan 18, 2017 6:02 PM IST

allu-arvind
మెగాస్టార్ చిరంజీవి తొమ్మిదేళ్ళ తర్వాత ‘ఖైదీ నంబర్ 150’ అంటూ వచ్చి అభిమానులకు సంబరాలను తెచ్చిపెట్టిన విషయం తెలిసిందే. సంక్రాంతి కానుకగా విడుదలైన ఆయన రీ ఎంట్రీ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ వర్షం కురిపిస్తూ దూసుకుపోతోంది. ఇక నిన్నటితో మొదటివారం పూర్తి చేసుకున్న ఈ సినిమా నేటినుంచి విజయవంతంగా రెండో వారంలోకి అడుగుపెట్టింది. తెలుగు సినీ పరిశ్రమలో అతి త్వరగా 100 కోట్ల గ్రాస్ వసూళ్ళు రాబట్టిన సినిమాగా ‘ఖైదీ నంబర్ 150’ నిలిచిందని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ స్పష్టం చేశారు.

హైద్రాబాద్‌లో ‘ఖైదీ నంబర్ 150’ మొదటివారం సాధించిన వసూళ్ళను తెలియజేస్తూ అల్లు అరవింద్, వీవీ వినాయక్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి రామ్ చరణ్ రావాల్సింది ఉన్నా, చివరి నిమిషంలో మార్పులు జరిగాయని అరవింద్ అన్నారు అన్నారు. ఇక త్వరలోనే సక్సెస్ మీట్‌లో రామ్ చరణ్ సహా టీమ్ అంతా హాజరవుతారని తెలుపుతూ.. మొదటివారం ముగిసేసరికి ప్రపంచవ్యాప్తంగా ‘ఖైదీ నంబర్ 150’ 108.48 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసిందని స్పష్టం చేశారు. ఒక్క రెండు తెలుగు రాష్ట్రాల నుంచే 76 కోట్లు రాగా, మిగతా 32 కోట్ల రూపాయలు మిగతా ప్రాంతాల నుంచి వచ్చాయని అల్లు అరవింద్ తెలిపారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు