మొత్తానికి చిరంజీవి ముగించేశాడు !

మొత్తానికి చిరంజీవి ముగించేశాడు !

Published on Dec 2, 2016 6:17 PM IST

khaidi-150-1
మెగాస్టార్ చిరంజీవి కొన్నేళ్ల క్రితం నుండే 150వ సినిమా త్వరలో చేస్తాను త్వరలో చేస్తాను అంటూ అభిమానవులను ఊరించి ఊరించి ఎన్నో వాయిదాలు, పుకార్లు తరువాత ఎట్టకేలకు కొన్ని నెలల క్రితమే సినిమాని మొదలుపెట్టారు. దాంతో తీవ్ర ఉతకంతకు లోనైన అభిమానులంతా హమ్మయ్య ఎలాగయితేనేం మెగాస్టార్ సినిమా మొదలుపెట్టేశాడు అనుకుని ఊపిరి పీల్చుకున్నారు. కానీ అంతలోనే వాళ్లకు మరో భయం పట్టుకుంది. అదేమిటంటే మొదలుపెట్టడమే అనుమానంగా మొదలుపెట్టారు. పైగా చిరు 9 ఏళ్ళ తరువాత షూటింగ్ లోకి దిగుతున్నారు. ఆయనలో పాత హుషాఋ, స్పీడు ఉంటాయా లేదంటే మరొకొన్ని వాయిదాలు భరించాలా అని మరొక టెంక్షన్ లోకి వెళ్లారు.

కానీ వారందరికీ ధైర్యం చెబుతూ చిరంజీవి నాన్ స్టాప్ గా సినిమా చేశారు. వరుస షెడ్యూళ్లతో చిన్న చిన్న బ్రేకులు మాత్రమే తీసుకుంటూ యంగ్ హీరోలకన్నా స్పీడుగానే సినిమా షూటింగ్ ను చివరి దశకు తీసుకొచ్చారు. ప్రస్తుతానికి టాకీ పార్ట్ మొత్తం ఫినిష్ కాగా ఇక చిరు, కాజల్ ల మధ్య నడిచేఆఖరి పాట షాట్ జరుగుతోంది. అది కూడా రేపో ఎల్లుండో పూర్తైపోతుంది. ఈ వార్త తెలియగానే అభిమానులంతా ఫుల్ ఖుషీ అయ్యారు. ఇంకేం పరవాలేదు సినిమా అనుకున్న టీమ్ కే రిలీజ్ అయిపోతుంది అని ధీమాగా ఉన్నారు. ఇకపోతే రామ్ చరణ్ కొణిదల ప్రొడక్షన్స్ బ్యానర్ పై స్వయంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి వినాయక్ దర్శకత్వం వహిస్తుండగా, దేవి శ్రీ సంగీతం అందిస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు