‘అజ్ఞాతవాసి’ టీమ్ కు బై బై చెప్పిన సీనియర్ నటి !

పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ ల కాంబినేషన్లో రూపొందుతున్న ‘అజ్ఞాతవాసి’ చిత్రం ప్రస్తుతం హైదరాబాద్లో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ షెడ్యూల్లో పవన్ తో పాటు ఇతర ముఖ్య నటీనటులపై కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. ఇదిలా ఉండగా సినిమ్లో ఒక కీ రోల్ చేస్తున్న సీనియర్ నటి కుష్బు ఈరోజుటితో తన వంతు షూటింగ్ పార్ట్ ను ముగించుకుని టీమ్ కు గుడ్ బై చెప్పారు.

ఈ సందర్బంగా ఆమె కాస్త భావోద్వేగానికి గురయ్యారు. ఈరోజుటితో నా షూటింగ్ ముగిసింది. ఇంత మంచి టీమ్ కు గుడ్ బై చెప్పాలంటే కొంత బాధగా ఉంది. త్రివిక్రమ్ తో పనిచేయడం చాలా బాగుంది. పని పట్ల ఆయన నిబద్దత నన్ను కట్టిపడేసింది. నా సహా నటుడు పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు అన్నారు. వచ్చే ఏడాది సంక్రాతి కానుకగా జనవరి 10న విడుదలకానున్న ఈ సినిమా భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి అంచనాల్ని ఇంకాస్త పెంచింది.

 





Like us on Facebook