రవితేజ-కళ్యాణ్ రామ్ ల ‘కిక్ 2’ ఆడియో రిలీజ్ డేట్

రవితేజ-కళ్యాణ్ రామ్ ల ‘కిక్ 2’ ఆడియో రిలీజ్ డేట్

Published on May 4, 2015 8:28 AM IST

Kick2
మాస్ మహారాజ రవితేజ బాడీ లాంగ్వెజ్ కి, అతని ఎనర్జీ లెవల్స్ కి పర్ఫెక్ట్ గా సరిపోయే పాత్రలో చేసిన సినిమా ‘కిక్’. ఈ సినిమా రవితేజ కమర్షియల్ గా పెద్ద హిట్ అవ్వడమే కాకుండా తన కెరీర్ కి బిగ్గెస్ట్ బూస్టప్ ఇచ్చింది. ఇప్పుడు అదే లెవల్ ఎనర్జీ, అంతే ఎంటర్టైన్మెంట్ తో మరోసారి ప్రేక్షకులను నవ్విచడానికి వస్తున్న సినిమా ‘కిక్ 2’. దాదాపు షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమాని ఇదే నెలలో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. అందులో ముందుగా ఎస్ఎస్ తమన్ అందించిన మ్యూజిక్ ఆల్బమ్ ని రిలీజ్ చెయ్యడానికి డేట్ ఫిక్స్ చేసారు. మే 9న కిక్ 2 ఆడియోని రిలీజ్ చేయనున్నారు.

కిక్ సినిమాకి కొనసాగింపుగా ఆ పార్ట్ లోని రవితేజ – ఇలియానాల వారసుడి కథని ఆధారం చేసుకొని ‘కిక్ 2’ సినిమాని తెరకెక్కించారు. రవితేజ ఇందులో ద్విపాత్రాభినయంలో కనిపించనున్నాడు. రవితేజ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని నందమూరి కళ్యాణ్ రామ్ ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నాడు. కిక్ సినిమాలనే ఈ సినిమాలో కూడా ఆద్యంతం ఎంటర్టైన్మెంట్ ఉంటూనే థ్రిల్ చేసే అంశాలు కూడా సమపాళ్ళలో ఉండేలా డైరెక్టర్ సురేందర్ రెడ్డి కేర్ తీసుకున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు