మిడ్ నైట్ సందడి చేసిన కిక్ 2 ఫస్ట్ టీజర్

మిడ్ నైట్ సందడి చేసిన కిక్ 2 ఫస్ట్ టీజర్

Published on Jan 26, 2015 9:33 AM IST

Kick2
మాస్ మహారాజ్ రవితేజ నటిస్తున్న మోస్ట్ క్రేజీ ప్రాజెక్ట్ ‘కిక్ 2’. అలాగే ఈ రోజు రవితేజ పుట్టిన రోజు. రవితేజ బర్త్ డే కానుకగా కిక్ 2 ఫస్ట్ టీజర్ ని లాంచ్ చేసారు. ఈ టీజర్ గత రాత్రి 12 గంటలకు రిలీజ్ చేసారు. ఈ టీజర్ రవితేజ అభిమానులను ఫుల్ ఖుషీ చేసింది. ముఖ్యంగా ఈ సినిమాలో రవితేజ లుక్ మరియు తమన్ ,మ్యూజిక్ టీజర్ కి హైలైట్ గా నిలిచాయి.

సమ్మర్ లో రిలీజ్ కానున్న ఈ సినిమాకి తీజర్ రిలీజ్ కావడంతో మిడ్ నైట్ నుండే ఫుల్ క్రేజ్ ఏర్పడింది. కిక్ కి దర్శకత్వం వహించిన సురేందర్ రెడ్డి కిక్ 2 కి కూడా దర్శకత్వం వహిస్తున్నాడు. కిక్ లోని రవితేజ – ఇలియానా కుమారుడి కథే ఈ కిక్ 2 అని ఈ చిత్ర టీం తెలిపింది. నందమూరి కళ్యాణ్ రామ్ ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై ఈ సినిమాని నిర్మిస్తున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి తమన్ మ్యూజిక్ డైరెక్టర్.

 

కిక్ 2 టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు