సెంటిమెంట్ రిలీజ్ డేట్ మిస్ అవనున్న ‘కిక్ 2’

సెంటిమెంట్ రిలీజ్ డేట్ మిస్ అవనున్న ‘కిక్ 2’

Published on Apr 21, 2015 3:58 PM IST

kick-2
మాస్ మహారాజ రవితేజకి కమర్షియల్ గా బిగ్గెస్ట్ బ్రేక్ ఇచ్చిన సినిమా ‘కిక్’. ప్రస్తుతం ‘కిక్’ సినిమాకి సీక్వెల్ గా ‘కిక్ 2’ సినిమా తెరకెక్కుతున్న విషయం మనకు తెలిసిందే. షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ సినిమా కోసం ఈ చిత్ర టీం ఓ సెంటిమెంట్ రిలీజ్ డేట్ ని అనుకున్నారు. అదే మే 7. ఎందుకంటే అదే రోజున రవితేజ – సురేందర్ రెడ్డిల కిక్ రిలీజ్ అయ్యింది, అలాగే కళ్యాణ్ రామ్ – సురేందర్ రెడ్డిల ‘అతనొక్కడే’ సినిమా కూడా అదే రోజున రిలీజ్ అయ్యి పెద్ద హిట్ అయ్యాయి. కావున ఇదే రోజున కిక్ 2 ని రిలీజ్ చెయ్యాలని అనుకున్నారు.

తాజాగా ఈ చిత్ర టీంకి సన్నిహితులు చెప్పిన సమాచారం ప్రకారం కిక్ 2 సినిమాని మే మధ్యలో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారట. మే రెండవ వారం లేదా మూడవ వారంలో సినిమా రిలీజ్ అవుతుందని సమాచారం. దీనివల్ల ఈ చిత్ర టీం సెంటిమెంట్ రిలీజ్ డేట్ ని మిస్ అవుతున్నారు. ఇటీవలే స్విట్జర్ ల్యాండ్ లో షూట్ చేసిన సాంగ్స్ తో ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్న ఈ సినిమాలోరవితేజ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా కనిపించనుంది. నందమూరి కళ్యాణ్ రామ్ ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమాకి తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు