మళ్ళీ వాయిదా పడిన ‘కిక్ 2’..!

మళ్ళీ వాయిదా పడిన ‘కిక్ 2’..!

Published on May 26, 2015 7:54 PM IST

kick-2
‘కిక్ 2’ సినిమా ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్న అభిమానులకు మరో మూడు వారాలు ఈ ఎదురుచూపులు తప్పేలాలేవు. మాస్ మహారాజ్ రవితేజ కెరీర్‌లో మరిచిపోలేని సినిమాగా నిలిచిన ‘కిక్’‌కు సీక్వెల్‌గా ‘కిక్ 2’ రూపొందుతోన్న విషయం తెలిసిందే! ‘కిక్’ సినిమాకు దర్శకత్వం వహించిన సురేందర్ రెడ్డియే ఈ సినిమాకూ దర్శకత్వం వహించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది.

ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై హీరో కళ్యాణ్ రామ్ నిర్మించిన ఈ సినిమాను మొదట మే 7నే విడుదల చేయాలనుకున్నా, సినిమాకు సంబంధించిన పనులు పూర్తి కాకపోవడంతో విడుదల వాయిదా పడింది. ఇక అప్పట్నుంచీ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్ సంచలనం సృష్టిస్తున్నాయి. జూన్ మొదటి వారంలో సినిమా విడుదలవనుందనే ప్రచారం జరిగినా ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు జూన్ రెండు లేదా మూడో వారంలో సినిమాను విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. రవితేజ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు థమన్ సంగీతం సమకూర్చారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు