తమిళనాడులో పూర్తిగా నిలిచిపోయిన సినీ పరిశ్రమ !

తమిళనాడులో పూర్తిగా నిలిచిపోయిన సినీ పరిశ్రమ !

Published on Jan 19, 2017 11:27 AM IST

fefsi
తమిళనాడులో జల్లికట్టు క్రీడపై ప్రభుత్వం విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని జరుగుతున్న నిరసన తీవ్రస్థాయికి చేరుకుంది. వేలాది మంది విద్యార్థులు, ప్రజలు చెన్నై మెరీనా బీచ్ వద్ద చేరి నిరసన తెలుపుతున్నారు. వారికి సపోర్ట్ గా యావత్ తమిళ సినీ లోకమే తరలివచ్చింది. విజయ్, కమల్ హాసన్, రజనీకాంత్ వంటి హీరోలు ఇప్పటికే మద్దత్తు ప్రకటించగా శింబు, శివకార్తికేయన్, విజయ్ సేథుపతి, జివి ప్రకాష్ కుమార్ లాంటి యువ హీరోలంతా నేరుగా నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.

వీరికి సపోర్ట్ గా దక్షిణ భారత చలన చిత్ర కార్మికుల సమ్మేళనం తమిళనాడులో ప్రస్తుతం జరుగుతున్న షూటింగ్, ఎడిటింగ్, డబ్బింగ్, మ్యూజిక్ కంపోజిషన్ వంటి అన్ని రకాల సినిమాలు పనుల్ని గురువారం నాడు పూర్తిగా నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో తమిళనాట సినీ పరిశ్రమ ఈరోజు పూర్తిగా స్తంభించిపోయింది. ఆందోళన తీవ్ర రూపం దాల్చుతుండటంతో ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ప్రధాని మోదీతో ఈ విషయంపై చర్చించనున్నారని తెలుస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు