బాపట్లలో ప్రారంభమైన కోన వెంకట్ రుచులు

బాపట్లలో ప్రారంభమైన కోన వెంకట్ రుచులు

Published on Jan 30, 2015 2:55 PM IST

Kona-Venkat-started-in-Bapa
ప్రముఖ రచయిత కోన వెంకట్, హోటల్ వ్యాపార రంగంలోకి అడుగు పెడుతున్న సంగతి తెలిసిందే. ‘కోన & కూచిపూడి రుచులు’ పేరుతో గుంటూరు జిల్లా బాపట్లలో ఈ రోజు రెస్టారెంట్ ను ప్రారంభించారు. ఈ రెస్టారెంట్ ప్రముఖ హీరోయిన్ అంజలి చేతుల మీదుగా ప్రాంభమైంది. తర్వాత ఇతర నగరాలలో ఈ రెస్టారెంట్ బ్రాంచిలను ఓపెన్ చేసే ఉద్దేశ్యంలో ఉన్నారు.

ఈ రెస్టారెంట్ బుజినెస్స్ లో కోన వెంకట్ భాగస్వామి అయిన కూచిపూడి వెంకట్ కు హైదరాబాద్ లో ఫేమస్ రెస్టారెంట్ ఉంది. ‘ఉలవచారు అండ్ కిచెన్ ఆఫ్ కూచిపూడి’ పేరుతో నడుస్తోంది. సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ కొట్టిన కోన వెంకట్, హోటల్ రంగలో కూడా సక్సెస్ కావాలని ఆశిద్దాం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు