మరోసారి సంపత్ ని సెలెక్ట్ చేసుకున్న కొరటాల శివ

మరోసారి సంపత్ ని సెలెక్ట్ చేసుకున్న కొరటాల శివ

Published on Oct 2, 2014 7:16 PM IST

Koratalla-Siva
స్వతహాగా తమిళియన్ అయిన సంపత్ రాజ్ ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా తెలుగు, తమిళ్ మరియు కన్నడ భాషల్లో వరుసగా సినిమాలు చేస్తూ నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. కొరటాల శివ డైరెక్ట్ చేసిన ‘మిర్చి’ సినిమాతో బాగా ఫేమస్ అయిన సంపత్ ఈ సంవత్సరం చేసిన ‘రన్ రాజా రన్’, ‘పవర్’, ‘లౌక్యం’ సినిమాలు బాక్స్ ఆఫీసు వద్ద పెద్ద హిట్స్ గా నిలిచాయి. చూడటానికి మంచి హైట్, ఫిజిక్ ఉన్న సంపత్ క్లాస్ లేదా మాస్ పాత్రలకు పర్ఫెక్ట్ గా సెట్ అయ్యేలా ఉండడం తనకి ప్లస్ పాయింట్.

తాజా సమాచారం ప్రకారం సంపత్ రాజ్ కి కొరటాల శివ తన రెండవ సినిమాలో కూడా ఓ కీలక పాత్ర ఇచ్చాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం సెట్స్ పై ఉంది. ఈ నెలలోనే మహేష్ బాబు కూడా సెట్స్ లో ఎంటర్ కానున్నాడు. మరి కొరటాల మరోసారి సంపత్ ని మహేష్ కి పోటీ ఇచ్చే విలన్ గా చూపించనున్నాడా.? లేక వేరే ఏమన్నా పాత్రలో చూపించనున్నాడా.? అనేది తెలియాల్సి ఉంది.

మహేష్ బాబు సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని మైత్రి మూవీస్ వారు నిర్మిస్తున్నారు. దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు