మహేష్ సినిమాలో శృతినే హీరోయిన్ – కొరటాల శివ

మహేష్ సినిమాలో శృతినే హీరోయిన్ – కొరటాల శివ

Published on Nov 27, 2014 3:31 AM IST

Koratala-srinivas-Shruti-Ha
మహేష్ బాబు సినిమా నుండి హీరోయిన్‌గా శృతి హాసన్ ను తప్పించారంటూ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. పూణేలో జరిగిన షెడ్యూల్ లో శృతి హాసన్ పాల్గొంది. ఆ తర్వాత తమిళం, హిందీలో చేస్తున్న సినిమాల కోసం డేట్స్ కేటాయించింది. మహేష్ బాబు సినిమాకు శృతి హాసన్ డేట్స్ కేటాయించకుండా ఇబ్బంది పెడుతుందని వార్తలు వచ్చాయి. వీటిని దర్శకుడు కొరటాల శివ ఖండించారు.

‘శృతి హాసన్ మా సినిమాలో భాగమే. పూణేలో ఒక షెడ్యూల్ పూర్తయింది. డిసెంబర్ 10 నుండి ప్రారంభమయ్యే షెడ్యూల్ లో శృతి పాల్గొంటుంది. ఈ పుకార్లు ఎక్కడ నుండి వస్తున్నాయో..? అర్ధం కావడం లేదు’ అంటూ దర్శకుడు కొరటాల శివ ట్వీట్ చేశారు.

మైత్రి మూవీస్ పతాకంపై యలమంచిలి రవి శంకర్, మోహన్, ఎర్నేని నవీన్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు