నితిన్ మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ టైటిల్ రివీల్ చేసిన కొరటాల.!

నితిన్ మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ టైటిల్ రివీల్ చేసిన కొరటాల.!

Published on Oct 1, 2020 5:05 PM IST

“భీష్మ” చిత్రంతో టాలీవుడ్ యూత్ స్టార్ నితిన్ మరోసారి మంచి సాలిడ్ కం బ్యాక్ హిట్ ను అందుకున్నాడు. ఇక ఈ చిత్రం విజయంతో నితిన్ మరిన్ని ఆసక్తికర ప్రాజెక్టులను చేపట్టాడు. అలా ఎంచుకున్న ప్రాజెక్టులలో మన టాలీవుడ్ టాలెంటెడ్ సీనియర్ దర్శకుడు చంద్ర శేఖర్ యేలేటితో చేయనున్న ప్రాజెక్ట్ కూడా ఒకటి. అయితే మంచి అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రంపై గత కొన్ని రోజుల నుంచి సినీ వర్గాల్లో మంచి హైప్ నడుస్తుంది.

ఆ క్రమంలోనే చిత్ర యూనిట్ కూడా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ మరియు ప్రీ లుక్ పోస్టర్ ను విడుదల చేయనున్నామని ప్రకటించారు. అన్నట్టుగానే ఈరోజు సాయంత్రం 4:30 నిమిషాలకు కొరటాల ఈ చిత్రం ప్రీ లుక్ తో పాటుగా టైటిల్ ను రివీల్ చేసారు. ఈ చిత్రానికి చంద్రశేఖర్ యేలేటి “చెక్” అనే టైటిల్ ను పెట్టగా ప్రీ లుక్ పోస్టర్ మాత్రం సాలిడ్ గా ఉందని చెప్పాలి.

“చెక్” అనే టైటిల్ కు తగ్గట్టుగానే సంకెళ్లతో నితిన్ చదరంగం ఆడుతున్నట్టుగా చూపిస్తున్నారు. మొత్తానికి మాత్రం ఈ ప్రీ లుక్ పోస్టర్ మంచి ఆసక్తిని రేకెత్తింది. ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుండగా ప్రియా ప్రకాష్ వారియర్ కూడా మరో పాత్రలో నటిస్తుంది. ఈ చిత్రాన్ని భవ్య క్రియేషన్స్ వారు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

https://twitter.com/sivakoratala/status/1311624153254957056?s=20

సంబంధిత సమాచారం

తాజా వార్తలు