మ్యూజిక్ డైరెక్టర్ గా అరంగేట్రం చేస్తున్న కోటి కుమారుడు

మ్యూజిక్ డైరెక్టర్ గా అరంగేట్రం చేస్తున్న కోటి కుమారుడు

Published on Jan 28, 2015 8:55 PM IST

Roshan-Salur
1990లలో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని తన సాంగ్స్ తో ఒక ఊపు ఊపిన మ్యూజిక్ డైరెక్టర్ కోటి. ఇప్పుడు ఆయన కుమారుడు రోషన్ సలుర్ ‘గాయకుడు’ సినిమాతో మ్యూజిక్ కంపోజ్ డైరెక్టర్ గా పరిచయం కానున్నాడు.రోషన్ న్యూ యార్క్ లోని పేరున్న మ్యూజిక్ ఇన్స్టిట్యూట్ లో మ్యూజిక్ లో ట్రైనింగ్ తీసుకున్నారు. ఈ సినిమా ఆఉదిఒ చాలా రోజుల ముందే రిలీజ్ అయినా సినిమా మాత్రం పలు కారణాల వల్ల ఇంకా రిలీజ్ కాలేదు. కానీ రోషన్ మాత్రం ఆడియో మంచి హిట్ అయ్యినందుకు చాలా హ్యాపీగా ఉన్నాడు.

ఈ మ్యూజికల్ లవ్ స్టొరీ గురించి చెబుతూ ‘హ్యాపీ గా లైఫ్ ని ని గడిపే ఓ సింగర్ కథే గాయకుడు. ఒక్కసారి తన పుట్టుక వెనకున్న కారణాలు తెలుసుకోగానే కథ చాలా ఆసక్తికరంగా మారుతుందని’ అన్నాడు. సిద్దాన్స్, అక్షర ప్రధాన పాత్రలు పోషించారు. అక్షర దూకుడు సినిమాలో సమంతకి చెల్లెలిగా నటించింది. కమల్ దర్శకత్వం వహించగా, రవీంద్రనాథ్ నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరిలో రిలీజ్ కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు