కృష్ణవంశీకి జన్మదిన శుభాకాంక్షలు

కృష్ణవంశీకి జన్మదిన శుభాకాంక్షలు

Published on Jul 28, 2014 9:09 AM IST

krishna-vamsi

ఎంతో పవర్ఫుల్ అయిన సినిమా అనే మాద్యమం ద్వారా ఎప్పటికప్పుడు మన తెలుగు సాంప్రదాయాలను మరియు దేశ సమగ్రతను కాపాడే పాయింట్స్ తో సినిమాలు చేసే డైరెక్టర్ కృష్ణవంశీ. ఎ రోజు ఆయన పుట్టిన రోజు. ‘సింధూరం’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన కృష్ణవంశీ మొదటి సినిమాతో నక్సలిజంలోని మరో కోణాన్ని చూపించి అందరినీ ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత్ ఆయన చేసిన ‘నిన్నే పెళ్ళాడతా’ లో కుటుంబ విలువలు చూపిస్తే, ‘ఖడ్గం’ సినిమాతో దేశంలోని అన్ని మతాల వారు ఒక్కటే అని చూపించాడు.

ఇలా తను తీసిన ‘చంద్రలేఖ’, ‘మురారి’, ‘చక్రం’, ‘చందమామ’, ‘శ్రీ ఆంజనేయం’, ‘మహాత్మ’ ఇలా ప్రతి సినిమాలోనూ ఎదో ఒక వైవిధ్యాన్ని చూపించాడు. సినిమాలతో పాటు సినిమాల్లోని పాటలను తీయడంలో కూడా కృష్ణవంశీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. ప్రస్తుతం కృష్ణవంశీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమా చేస్తున్నాడు. చక్కని కుటుంబ విలువలతో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం పొల్లాచ్చిలో జరుగుతోంది. ఈ సినిమా అక్టోబర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీకి 123తెలుగు.కామ్ తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు