ప్రమోషన్స్‌తో జోరు పెంచిన ‘కృష్ణగాడు’..!

ప్రమోషన్స్‌తో జోరు పెంచిన ‘కృష్ణగాడు’..!

Published on Feb 9, 2016 2:16 AM IST

krishna-gadi-veera-prema-ga
న్యాచురల్ స్టార్ నాని, ‘అందాల రాక్షసి’ సినిమాతో అందరి దృష్టినీ ఆకర్షించిన దర్శకుడు హను రాఘవపూడిల కాంబినేషన్‌లో ‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ’ అనే సినిమా విడుదలకు సిద్ధమైన విషయం తెలిసిందే. 14 రీల్స్ నిర్మాణంలో రూపొందిన ఈ సినిమా ఫిబ్రవరి 12న పెద్ద ఎత్తున విడుదల కానుంది. ‘భలే భలే మగాడివోయ్’ లాంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత నాని నటించిన సినిమా కావడంతో ‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ’పై మొదట్నుంచీ విపరీతమైన అంచనాలున్నాయి. ఇక ఆ అంచనాలను రెట్టింపు చేసేలా ట్రైలర్, ఆడియో ఉండడంతో నానికి మరో సూపర్ హిట్ ఖాయమనే టాక్ ఇప్పట్నుంచే వినబడుతోంది.

ఇక సినిమా విడుదలకు మరో ఐదు రోజులే ఉండడంతో టీమ్ ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేసింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలన్నీ పూర్తవడంతో నానితో పాటు హీరోయిన్ మెహ్రీన్, దర్శకుడు హను, సినిమాలో కీలక పాత్రల్లో నటించిన ముగ్గురు చిన్నారులు.. అంతా ప్రమోషన్స్‌తో జోరు మీదున్నారు. ఇక ముఖ్యంగా టార్గెట్ ఆడియన్స్ అయిన యూత్ కోసం 14 రీల్స్ టీమ్ సోషల్ మీడియా ప్రమోషన్స్‌ను పెద్ద ఎత్తున చేపట్టడం విశేషంగా చెప్పుకోవచ్చు. సినిమాకు మొదట్నుంచీ ఉన్న క్రేజ్, ప్రస్తుతం చేపట్టిన ప్రమోషన్స్‌ను బట్టి చూస్తే కృష్ణగాడికి మొదటి వీకెండ్ సూపర్ ఓపెనింగ్స్ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు