రామ్ చరణ్ సిస్టర్ గా కనిపించనున్న కృతి కర్బంద.!

రామ్ చరణ్ సిస్టర్ గా కనిపించనున్న కృతి కర్బంద.!

Published on Feb 26, 2015 8:31 AM IST

kriti-kharbanda-and-ramchar
‘గోవిందుడు అందరివాడు’ లాంటి ఫ్యామిలీ ఎంటర్ తినేర్ తర్వాత మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తన తదుపరి సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా ఇంకా సెట్స్ పైకి తీసుకెళ్ళలేదు. శ్రీను వైట్ల దర్శకత్వంలో రామ్ చరణ్ చేయనున్న సినిమా మార్చి 5 లాంచనంగా ప్రారంభం కానుంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మార్చి 16 నుంచి ప్రారంభం కానుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా చివరి దశకు చేరుకుంటున్నాయి. శ్రీను వైట్ల – కోన వెంకట్ – గోపి మోహన్ కలిసి ఈ సినిమాని స్క్రిప్ట్ చాలా పర్ఫెక్ట్ గా రెడీ చేస్తున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది.

ఈ సినిమాలో ‘తీన్ మార్’, ‘ఒంగోలు గిత్త’ సినిమాలో కనిపించిన కన్నడ భామ కృతి కర్భంద ఈ సినిమాలో మరో ముఖ్య పాత్రలో కనిపించనుందని ఇది వరకే తెలియజేశాం. తాజా సమాచారం ప్రకారం కృతి కర్బంద చేయనున్న పాత్ర గురించిన ఆసక్తికర విషయాలు తెలిసాయి. మాకు అందిన సమాచారం ప్రకారం కృతి ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా కాకుండా రామ్ చరణ్ కి సిస్టర్ గా కనిపించనుంది. మరోవైపు రామ్ చరణ్ తల్లి పాత్రకి జీవితా రాజశేఖర్ ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా పూర్తి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఉంటూనే రామ్ చరణ్ అభిమానులు కోరుకునే యాక్షన్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయని సమాచారం. అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ అందించనున్న ఈ సినిమాని అక్టోబర్ 15న రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. డివివి దానయ్య ఈ సినిమాకి నిర్మాత.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు