సల్మాన్ ఖాన్ సినిమాలో కృతీ సనన్!

సల్మాన్ ఖాన్ సినిమాలో కృతీ సనన్!

Published on Jul 1, 2015 11:07 AM IST

Kriti-sanan
‘1 నేనొక్కడినే’ సినిమాతో వెండితెరకు పరిచయమైన కృతి సనన్.. తన మొదటి సినిమాతోనే అందం, నటనలో మంచి మార్కులు కొట్టేసింది. ఆ తర్వాత తెలుగు, హిందీలో వరుస అవకాశాలతో దూసుకుపోతున్న ప్రస్తుతం బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే! షారూఖ్ సినిమాలో అవకాశం కృతి సనన్ రేంజ్‌ను అమాంతంగా పెంచేసింది. బాలీవుడ్‌లో పలు పెద్ద సంస్థలు తమ సినిమా కోసం కృతీ సనన్‌ను సంప్రదించడం విశేషంగా కనిపిస్తోంది.

తాజాగా బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కొత్త సినిమాలో నటించే అవకాశాన్ని సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. సుల్తాన్ పేరుతో యాశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించనున్న ఈ సినిమాకు అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహించనున్నారు. వచ్చే ఏడాది రంజాన్ రిలీజ్‌కు ప్లాన్ చేసిన ఈ సినిమా షూటింగ్ 2015 చివర్లో మొదలుకానుంది. ఇక ఈ సినిమాకు హీరోయిన్‌గా కృతీ సనన్‌ను సంప్రదించగా ఆమె కూడా సినిమా కోసం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే కృతీ సనన్‌కు స్క్రిప్ట్ కూడా నెరేట్ చేశారట. ఇక ఈ విషయమై అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు