షాక్ చేస్తున్న ‘కుమారి 21F’ ఓవరాల్ షేర్

షాక్ చేస్తున్న ‘కుమారి 21F’ ఓవరాల్ షేర్

Published on Nov 26, 2015 5:12 PM IST

Kumari21f
కెరీర్ ప్రారంభం లోనే ఉయ్యాలా జంపాలా’, ‘సినిమా చూపిస్త మావ’ అంటూ హిట్స్ అందుకున్న యంగ్ హీరో రాజ్ తరుణ్ గత వారం రిలీజ్ అయిన ‘కుమారి 21F’తో కూడా సిఉపెర్ హిట్ అందుకొని హ్యాట్రిక్ హిట్స్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. స్టార్ డైరెక్టర్ అయిన సుకుమార్ కథ – స్క్రీన్ ప్లే అందించడంతో పాటు నిర్మాతగా మారి చేసిన సినిమా ద్వారా హేభ పటేల్ హీరోయిన్ గా కనిపించింది. మెచ్యూర్ లవ్ స్టొరీగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకి అన్ని ఏరియాలలో సూపర్బ్ కలెక్షన్స్ వస్తున్నాయి.

ఇటీవలే మేము ఒక్క నైజాంలోనే ఓవరాల్ గా ఈ సినిమా 5.5 కోట్ల షేర్ సాధిస్తుందని తెలియజేశాం. ఓవరాల్ గా ఇరు రాష్ట్రాల్లో ఈ సినిమా ఎంత షేర్ తో క్లోజ్ అవుతుంది అనే విషయాన్ని తెలుసుకోగా ట్రేడ్ వర్గాలు అందరూ షాక్ అయ్యే ఫిగర్స్ చెప్పారు. కుమారి 21F ఓవరాల్ గా 16-17 కోట్ల షేర్ తో క్లోజ్ అవుతుందని తెలియజేశారు. అనగా ఈ సినిమా బడ్జెట్ కంటే దాదాపు రెండింతలు కలెక్ట్ చేయనుంది. రాజ్ తరుణ్ కెరీర్లోనే అత్యధిక షేర్ సాధించిన సినిమాగా మిగిలిపోయింది. పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు