విడుదలకు సిద్ధమవుతున్న ‘కుందనపు బొమ్మ’

విడుదలకు సిద్ధమవుతున్న ‘కుందనపు బొమ్మ’

Published on Apr 25, 2015 12:03 PM IST

Kundanapu-Bomma
దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు సపర్పణలో రూపొందిన అచ్చ తెలుగు సినిమా కుందనపు బొమ్మ. ఎస్.ఎల్.ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై జి. అనిల్ కుమార్ రాజు, జి. వంశీకృష్ణలు ఈ సినిమాను నిర్మించారు. ముళ్ళపూడి వరా దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. కుందనపు బొమ్మ పల్లెటూరి నేపథ్యంలో తెరకెక్కిన ఓ అందమైన కుటుంబ ప్రేకకథ అని చిత్ర యూనిట్ తెలిపింది.

లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఫేం సుధాకర్ కోమాకుల, చాందినీ చౌదరి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు ఎం.ఎం.కీరవాణి సంగీతాన్ని అందించారు. ఎస్.డి.జాన్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించిన ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. మే నెలలోనే ఆడియోను, సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు చిత్ర నిర్మాతలు తెలిపారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు