సెన్సార్‌కు రెడీ అయిన ‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ’

సెన్సార్‌కు రెడీ అయిన ‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ’

Published on Feb 7, 2016 4:15 PM IST

KVPG
న్యాచురల్ స్టార్ నాని, ‘అందాల రాక్షసి’ సినిమాతో అందరి దృష్టినీ ఆకర్షించిన దర్శకుడు హను రాఘవపూడిల కాంబినేషన్‌లో ‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ’ అనే సినిమా విడుదలకు సిద్ధమైన విషయం తెలిసిందే. 14 రీల్స్ నిర్మాణంలో రూపొందిన ఈ సినిమా ఫిబ్రవరి 12న పెద్ద ఎత్తున విడుదల కానుంది. ‘భలే భలే మగాడివోయ్’ లాంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత నాని నటించిన సినిమా కావడంతో ‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ’పై మొదట్నుంచీ విపరీతమైన అంచనాలున్నాయి. ఇక ఆ అంచనాలను రెట్టింపు చేసేలా ట్రైలర్, ఆడియో ఉండడంతో నానికి మరో సూపర్ హిట్ ఖాయమనే టాక్ ఇప్పట్నుంచే వినబడుతోంది.

నేటితో అన్ని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలనూ పూర్తి చేసిన యూనిట్, సినిమాను రేపు సెన్సార్‌కు పంపించనుంది. రిలీజ్‌కు సరిగ్గా నాలుగు రోజుల ముందే సెన్సార్ పూర్తి కానుంది. ఇక ఇదిలా ఉంటే.. ఇప్పటికే అన్నిచోట్లా వారం క్రిందటి నుంచే ప్రమోషన్స్ కూడా వేగవంతం అయ్యాయి. హీరో నాని దగ్గర్నుంచి మిగిలిన టీమ్ అంతా భారీ ఎత్తున ప్రమోట్ చేస్తున్నారు. మొదటి వీకెండ్ ఈ సినిమాకు మంచి ఓపెనింగ్స్ వచ్చే అవకాశం కనిపిస్తోంది. మెహ్రీన్ ఈ సినిమా ద్వారా హీరోయిన్‌గా పరిచయం అవుతున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు