బాలకృష్ణతో డేట్ బాగుందంటున్న హీరోయిన్ !
Published on Jul 27, 2017 3:46 pm IST


నందమూరి బాలకృష్ణ చేస్తున్న 101వ చిత్రం ‘పైసా వసూల్’ లో శ్రియా శరన్ తో పాటు బాలీవుడ్ నటి కైరా దత్ కూడా ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్న సంగతి తెల్సిందే. అయితే తాజాగా ఈమె హీరో బాలకృష్ణతో కలిసి డిన్నర్ డేట్ కి వెళ్లిన సంగతిని ఆమె స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలిపారు. అంతేగాక బాలకృష్ణ వ్యక్తిత్వాన్ని కూడా ఆకాశానికెత్తేశారు.

ట్విట్టర్ ద్వారా ఆమె మాట్లాడుతూ బాలకృష్ణగారు నిజమైన జెంటిల్మెన్ అని, ఆయన హృదయం చాలా మంచిదని, ఎంతో ప్రేమను, గౌరవాన్ని చూపిస్తారాని, ఆయనతో డేట్ చాలా బాగుందని అన్నారు. ఇలా హీరోయిన్లు బాలకృష్ణపై ప్రశంసలు కురిపించడం మొదటిసారేం కాదు. గతంలో కూడా పలువురు హీరోయిన్లు బాలకృష్ణను ఎంతగానో పొగిడిన సందర్భాలు చాలానే ఉన్నాయి. పూరిజగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 29న రిలీజ్ చేయనున్నారు.

 
Like us on Facebook