‘లచ్చి’ చిత్రం ఒక కామెడీ హర్రర్ థ్రిల్లర్ – జయతి

‘లచ్చి’ చిత్రం ఒక కామెడీ హర్రర్ థ్రిల్లర్ – జయతి

Published on Nov 20, 2017 10:40 AM IST

ప్రముఖ టీవీ యాంకర్ జయతి హీరోయిన్ గా మారుతూ చేసిన చిత్రం ‘లచ్చి’. ఈశ్వర్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. ఈ నెల నంవంబర్ 24న సినిమా రిలీజ్ కానుంది. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ‘యాంకరింగ్ చేస్తున్న సమయంలోనే ఈ సబ్జెక్ట్ విన్నాను. మొదట నేనే నటించాలని అనుకోలేదు. కానీ పాత్ర బాగుండటంతో చేయాలని డిసైడ్ చేసుకున్నాను. మొదటగా మలయాళం సినిమాను రీమేక్ చేద్దామనుకున్నాను. కానీ ఇది కుదిరింది. ఇందులో కథే హీరో.

ఈ సినిమా మొత్తం విలేజ్ బ్యాక్ డ్రాప్లోనే జరుగుతుంది. చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఒక ఊరికి ఉన్న సమస్యను దేవి అనే అమ్మాయి సాల్వ్ చేస్తుంది. ఆ దేవి పాత్రను నేనే చేస్తున్నాను. ఆ పాత్ర ఆత్మలను బందించేదిగా ఉంటుంది. సబ్జెక్ట్ సీరియస్ గా ఉంటుంది. మధ్యలో మంచి ఫన్, సస్పెన్స్ కూడా ఉంటుంది. కామెడీ హర్రర్ థ్రిల్లర్’ అన్నారు. జయతి స్వయంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి కందికొండ లిరిక్స్, సురేష్ యువన్ మ్యూజిక్ ను అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు