నవంబర్ 24న ‘లేడీస్ & జంటిల్ మెన్’ ఆడియో..!

నవంబర్ 24న ‘లేడీస్ & జంటిల్ మెన్’ ఆడియో..!

Published on Oct 30, 2014 12:00 PM IST

ladies-and-jentile-man
తన శిష్యుడు పిబి మంజునాథ్ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ దర్శకనిర్మాత మధుర శ్రీధర్ నిర్మిస్తున్న సినిమా ‘లేడీస్ & జంటిల్ మెన్’. ఈ సినిమా ఆడియోను నవంబర్ 24న విడుదల చేస్తున్నట్టు మధుర శ్రీధర్ తెలిపారు. ఈ సినిమాకు కుంచె రఘు సంగీతం అందించగా సిరాశ్రీ సాహిత్యం సమకూర్చారు. సైబర్ క్రైమ్ నేపధ్యంలో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. గతంలో రఘు కుంచె కంపోజ్ చేసిన ప్రమోషనల్ సాంగ్ యువతను ఆకట్టుకుంది.

మహాత్ రాఘవేంద్ర, చైతన్య కృష్ణ, అడవి శేష్, కమల్ కామరాజ్, స్వాతి దీక్షిత్, జాస్మిన్, తేజస్విని ఈ సినిమాలో ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. షిరిడి సాయి కంబైన్స్ పతాకంపై యంవికె రెడ్డి, మధుర శ్రీధర్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు