‘ఎవ్వరికీ చెప్పొద్దు’.. టీంని అభినందించిన ప్రముఖ నిర్మాత !

‘ఎవ్వరికీ చెప్పొద్దు’.. టీంని అభినందించిన ప్రముఖ నిర్మాత !

Published on Oct 17, 2019 5:32 PM IST

క్రేజీ యాంట్స్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై రాకేశ్‌ వర్రె, గార్గేయి ఎల్లాప్రగడ హీరో హీరోయిన్లుగా బసవ శంకర్‌ దర్శకత్వంలో రాకేశ్‌ వర్రె నిర్మాణంలో రూపొందిన లవ్‌స్టోరీ ‘ఎవ్వరికీ చెప్పొద్దు’. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర ఫిలింస్‌ పతాకంపై దిల్‌రాజు తెలుగులో అక్టోబర్‌ 8న విడుదల చేశారు. విడుదలైన అన్ని చోట్ల మంచి స్పందన లభించింది. ఫిల్మ్ క్రిటిక్స్ తో పాటు పలువురు సినీ ప్రముఖులు ఈ చిత్రాన్ని ఇష్టపడి తమ స్పందన తెలియజేశారు. వీరితో పాటు పలు హిట్ చిత్రాల్ని అందించిన ప్రముఖ నిర్మాత లగడపాటి శ్రీధర్ సినిమా టీంని అభినందించారు.

లగడపాటి శ్రీధర్ మాట్లాడుతూ.. పెళ్ళిచూపులు తర్వాత నాకు అంత మంచి ఫీలింగ్ ఈ సినిమా చూసిన తర్వాత కలిగింది. ఈ సినిమా ట్రైలర్ చూసినప్పుడే నాకు ఇందులో ఏదో స్పార్క్ ఉందనిపించింది. ఈ సినిమాలో ఫైర్ ఉంది. బుక్ మై షో లో… అలాగే ప్రేక్షకుల రివ్యూ చాలా బాగా వచ్చింది. ఈ సినిమా ఆహ్లాదకరంగా ఉంది. ప్రొడ్యూసర్ గా, హీరోగా రాకేష్ సక్సెస్ అయ్యాడు. టెక్నీషియన్స్ ఈ సినిమాకు బలం. శంకర్ మంచి డైరెక్టర్. బాగా చదువుకున్నాడు. చాలా మంచి సినిమా చేసినందుకు చాలా గర్వంగా ఉంది. ఈ సినిమా రైటింగ్ చాలా బాగుంది. మ్యూజిక్, సినిమాటోగ్రఫీ సూపర్బ్. రాకేష్ పట్టుదల వల్లే హీరో. ప్రొడ్యూసర్ అయ్యాడు. ఫిల్మ్ మేకింగ్ నేర్చుకొని సినిమా చేసాడు. స్క్రీన్ మీద చాలా బాగున్నారు. డైలాగ్స్ చాలా బాగా చెప్పాడు. హీరోయిన్ ని నార్త్ అమ్మాయి అనుకున్న. తెలుగు అమ్మాయి చాలా బాగా చేసింది. కొన్ని సీన్స్ లో హీరోను డొమినెట్ చేసింది. చిన్న సినిమాలను సపోర్ట్ చేయండి. 50 రోజుల సినిమాగా నిలుస్తుంది. అని అన్నారు.

చిత్ర దర్శకుడు బసవ శంకర్‌ మాట్లాడుతూ…. లగడపాటి గారికి స్పెషల్ థాంక్స్ . మమ్మల్ని పిలిచి అభినందించారు. చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమాని ప్రోత్సహిస్తున్న అందరికీ చాలా థాంక్స్. హీరోయిన్ గార్గేయి మాట్లాడుతూ… లగడపాటి గారి మాటలు మాకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చాయి. ఈ సినిమాకు మంచి బజ్ ఉంది. చూడని వారు తప్పకుండా చూడండి. హారతి అనే క్యారెక్టర్‌ని నాకు ఇచ్చిన డైరెక్టర్‌ బసవ శంకర్‌గారికి థ్యాంక్స్‌. అలాగే నిర్మాతగారికి థ్యాంక్స్‌. ఇంత మంచి ఎక్స్‌పీరియెన్స్‌ ఇచ్చిన నా టీమ్‌కు థ్యాంక్స్‌ అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు