వరుస అవకాశాలతో ‘లజ్జ’ హీరో..!

వరుస అవకాశాలతో ‘లజ్జ’ హీరో..!

Published on Feb 8, 2016 10:00 AM IST

varun1
‘1940లో ఒక గ్రామం’, ‘కమలతో నా ప్రయాణం’ లాంటి సినిమాలతో విమర్శకుల ప్రశంసలు, జాతీయ, ప్రాంతీయ అవార్డులు అందుకున్న దర్శకుడు నరసింహ నంది తాజాగా ‘లజ్జ’ అనే మరో సంచలనాత్మక కథతో మనముందుకు వచ్చిన విషయం తెలిసిందే. బూచేపల్లి తిరుపతి రెడ్డి నిర్మించిన ఈ సినిమా గత శుక్రవారం విడుదలైంది. పెళ్ళై, భర్త ప్రేమకు నోచుకోని ఓ భార్య ఆలోచనలు ఎలా ఉంటాయి అన్న ఆసక్తికర అంశంతో తెరకెక్కిన ఈ సినిమాలో వరుణ్, మధుమిత హీరో హీరోయిన్లుగా నటించారు. ఇక ఈ సినిమాలో నటించిన వారందరికీ మంచి పేరుతో పాటు వరుసగా అవకాశాలు కూడా వస్తూండడం విశేషంగా చెప్పుకోవచ్చు.

ముఖ్యంగా సెకండాఫ్‌లో కీలకమైన సమీర్ అనే పాత్రలో నటించిన వరుణ్, ఇప్పటికే రెండు సినిమా అవకాశాలను సొంతం చేసుకోవడం ఆసక్తికరంగా కనిపిస్తోన్న అంశం. ‘లజ్జ’ సినిమాతో తనను నటుడిగా పరిచయం చేసిన నరసింహ నంది దర్శకత్వంలోనే వరుణ్, మరో సినిమా చేయనున్నారు. ఇక దీంతో పాటు సంగీత దర్శకుడిగా మంచి పేరు సంపాదించి ఆ తర్వాత దర్శకుడిగా మారి మెప్పిస్తోన్న ఆర్.పీ.పట్నాయక్ తెరకెక్కించే సినిమాలో కూడా వరుణ్ హీరోగా నటించనున్నారు. ప్రస్తుతం ఈ రెండు ప్రాజెక్ట్స్ స్క్రిప్ట్ దశలో ఉన్నాయి. త్వరలోనే ఈ రెండు సినిమాలూ సెట్స్‌పై వెళ్ళనున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు