‘బాహుబలి’లో శివగామి పాత్రను ఎందుకు చేయలేదో చెప్పిన మంచు లక్ష్మి

‘బాహుబలి’లో శివగామి పాత్రను ఎందుకు చేయలేదో చెప్పిన మంచు లక్ష్మి

Published on Oct 25, 2016 4:45 PM IST

lakshmi-manchu
తెలుగు పరిశ్రమ గర్వించదగ్గ సినిమా ‘బాహుబలి’ సినిమాలో దర్శక ధీరుడు రాజమౌళి చేసిన విజువల్ వండర్స్ తెలుగు ప్రేక్షకులకు ఎంతగా గుర్తుండిపోయాయో వాటిలోని పాత్రలు కూడా అంతే బలంగా ప్రేక్షకుల మనస్సులో నిలబడిపోయాయి. అలాంటి పాత్రల్లో అతి ముఖ్యమైన పాత్ర, అసలు బాహుబలి కథ పుట్టడానికి మూలమైన పాత్ర అని రాజమౌళి గుర్తుచేసుకుని పాత్ర ‘శివగామి’ పాత్ర. తెరపై ఈ పాత్రను రమ్యకృష్ణ పోషించి ఆ పాత్రకే జీవం పోశారు. అయితే ఈ పాత్రలో నటించడానికి రాజమౌళి రమ్యకృష్ణ కంటే ముందు నటి మంచు లక్ష్మిని అడిగారట.

మామూలుగా అయితే ఎవరైనా రాజమౌళి పిలిచి, బాహౌబలి లాంటి గొప్ప సినిమాలో కీ రోల్ లో ఛాన్స్ ఇస్తానంటే ఎవరూ వద్దనరు. కానీ లక్ష్మి మాత్రం రాజమౌళి ఇచ్చిన ఆ అవకాశాన్ని కాదంది. అసలు అంత గొప్ప ఛాన్స్ ఎందుకు వద్దన్నదీ లక్ష్మి వివరిస్తూ ‘రాజమౌళి గారు శివగామి పాత్ర కోసం నన్ను అడిగారు. కానీ ప్రభాస్ కు తల్లిగా చేయడమేమిటని వద్దన్నాను. కానీ నాలోని టాలెంట్ ని గుర్తించి నన్ను అడిగిన రాజమౌళి గారికి థ్యాంక్స్. నేను చేయనన్న తరువాత శ్రీదేవి, టబు లని కూడా అడిగారు చివరి రమ్యకృష్ణగారు చేశారు. ఆ పాత్ర కాదనుకున్నందుకు నేనేమీ భాధపడటంలేదు’ అని అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు