ఫోటో మూమెంట్ : భావోద్వేగానికి గురైన మంచు లక్ష్మి!

ఫోటో మూమెంట్ : భావోద్వేగానికి గురైన మంచు లక్ష్మి!

Published on Mar 5, 2015 12:16 AM IST

manchu-vishnu
సినీ హీరో, మోహన్ బాబు చిన్న కుమారుడు మంచు మనోజ్ నిశ్చితార్థం ప్రణతిరెడ్డితో ఈ ఉదయం జరిగింది. పార్క్‌హయత్ హోటల్లో అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుకకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు విచ్చేసి మనోజ్-ప్రణతిల జంటను ఆశీర్వదించారు.

ఇక ఈ వేడుకలో మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి, కుమారుడు విష్ణులతో పాటు కుటుంబమంతా సందడి చేశారు. మనోజ్ ఓ ఇంటి వాడవుతున్న సందర్భంగా ఒకానొక దశలో మంచు లక్ష్మి భావోద్వేగానికి లోనయ్యారు. ఆ సమయంలో అక్కడే ఉన్న విష్ణు ఆమెను ఓదార్చారు. ఇక మే 20ని వివాహ తేదీగా నిర్ణయించారు. అదేరోజు మనోజ్ పుట్టినరోజు ఉన్నందున.. పుట్టినరోజునే మనోజ్ పెళ్ళి కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు