అఖిల్ స్టైలిష్ కాంబోపై మరో ఇంట్రెస్టింగ్ బజ్.!

అఖిల్ స్టైలిష్ కాంబోపై మరో ఇంట్రెస్టింగ్ బజ్.!

Published on Dec 2, 2020 12:00 PM IST

టాలీవుడ్ లో ఆల్ టైం హ్యాండ్సమ్ ఫ్యామిలీ అక్కినేని కుటుంబం నుంచి వచ్చిన యువ హీరోల్లో అక్కినేని అఖిల్ కూడా ఒకడు. తాను ఇప్పటికి చేసిన మూడు సినిమాలు కూడా బాక్సాఫీస్ పరంగా అంతగా ఆకట్టుకోకపోయినప్పటికీ తన నెక్స్ట్ ప్రాజెక్టుల విషయంలో మాత్రం మంచి హైప్ వస్తూనే ఉండటం గమనార్హం అది పూర్తిగా అఖిల్ మ్యాజిక్ అనే చెప్పులు.

అయితే ఇప్పుడు అఖిల్ పలు చిత్రాలతో బిజీగా ఉన్నాడు. వాటిలో టాలీవుడ్ స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డితో ప్లాన్ చేసిన సినిమా ఒకటి. అయితే ఈ చిత్రం కోర్ స్టోరీ లైన్ పై అప్పట్లోనే మంచి ఆసక్తికర వార్తలు వినిపించాయి. సురేందర్ రెడ్డి ఈ చిత్రాన్ని ఒక స్పై థ్రిల్లర్ గా మలుస్తారని అఖిల్ ఒక అదిరిపోయే రోల్ లో కనిపిస్తాడని గాసిప్స్ వినిపించాయి.

అలాగే ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ బజ్ కూడా వినిపిస్తుంది. దాని ప్రకారం ఈ చిత్రంలో విజువల్ ఎఫెక్ట్స్ కు కూడా మంచి ప్రాధాన్యత ఉంటుందని తెలుస్తుంది. గతంలో అఖిల్ మొట్ట మొదటి సినిమా “అఖిల్” లో కూడా విజువల్ ఎఫెక్ట్స్ ను ప్రాధాన్యత చూపించారు అలా ఈ చిత్రాన్ని కూడా మంచి బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించనున్నారని ఇప్పుడు గాసిప్.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు