తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమాల్లో ఎన్టీఆర్ చేస్తున్న ‘జై లవ కుశ’ కూడా ఒకటి. ‘జనతా గ్యారేజ్ ‘ వంటి హిట్ తర్వాత తారక్ చేస్తుండటం, ఇందులో ఆయన త్రిపాత్రాభినయం చేస్తుండటంతో ఈ సినిమాపై అందరిలోనూ మంచి అంచనాలున్నాయి. ప్రస్తుతం పూణేలో ఈ చిత్ర షూటింగ్ జరుగుతోంది. ఇకపోతే తాజాగా ఈ చిత్ర ఆడియో విడుదల తేదీపై వార్తలు వినవస్తున్నాయి.
అవేమిటంటే పాటల కార్యక్రమాన్ని ఆగష్టు 12న రిలీజ్ చేస్తారట. కానీ చిత్ర బృందం నుండి మాత్రం ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. కాబట్టి అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చేవరకు వేచి చూడాల్సిందే. మరోవైపు రెండవ పాత్ర లవకు సంబందించిన టీజర్ ను ఆగష్టు మొదటి వారంలోనే విడుదలచేయనున్నారు. రాశి ఖన్నా, నివేతా థామస్ లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 21న విడుదలచేయనున్నారు.
- అభిమానులెవ్వరూ కోపం తెచ్చుకోకూడదన్న పవన్ !
- కొత్త ఫోటోలు : తాప్సి
- కొత్త ఫోటోలు : సోనమ్ కపూర్
- సమీక్ష : భరత్ అనే నేను – మహేష్ మాట నిలబెట్టుకున్నాడు
- ‘భరత్ అనే నేను’ మొదటిరోజు ఏపి, తెలంగాణ వసూళ్లు !
సంబంధిత సమాచారం :

Subscribe to our Youtube Channel
తెలుగు రుచి - మల్లెమాల సంస్థ వారు అందిస్తున్న ఈ ఆన్ లైన్ కుకింగ్ ఛానెల్ ద్వారా మీరు నోరూరించే రుచికరమైన, ఆరోగ్యకరమైన వంటకాల తయారీని తక్కువ టైమ్ లో నేర్చుకోవచ్చు. ఇందులో అనుభవజ్ఞులైన, ప్రఖ్యాత చెఫ్ లు సులభ రీతిలో అన్ని రకాల వంటకాలను ఎలా చేయాలో మీకు నేర్పుతారు.