‘నా పేరు సూర్య’ విడుదల తేదీ మారనుందా ?

‘నా పేరు సూర్య’ విడుదల తేదీ మారనుందా ?

Published on Jan 22, 2018 4:12 PM IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న చిత్రం ‘నా పేరు సూర్య’. రచయిత వక్కంతం వంశీ దర్శకుడిగా మారుతూ చేస్తున్న మొదటి సినిమా ఇది. ఇందులో బన్నీ ఆవేశం కలిగిన సైనికుడి పాత్రలో కనిపించనున్నాడు. ఇది వరకే విడుదలైన ఫస్ట్ ఇంపాక్ట్ కూడా బ్రహ్మాండమైన స్పందనను దక్కించుకుంది. ఇకపోతే ఈ సినిమాను ఏప్రిల్ 27న రిలీజ్ చేయాలని కొన్ని నెలల క్రితమే నిర్ణయించారు నిర్మాతలు.

కానీ ఇప్పుడు మాత్రం ఆ తేదీ మారేలా ఉందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏప్రిల్ 27న మహేష్ బాబు, కొరటాల శివ ‘భరత్ అనే నేను’ విడుదలకానుండగా సూపర్ స్టార్ రజనీ, శంకర్ ల ‘2 పాయింట్ 0’ కూడా అదే రోజున వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో ‘నా పేరు సూర్య’ను వాటి మధ్యలో దింపి ఓపెనింగ్స్ ను కోల్పోవడం ఇష్టంలేక వేరే తేదీన రిలీజ్ చేయాలని భావిస్తున్నారట నిర్మాతలు. అంతేగాక ఒకవేళ తేదీ మారితే అది ఏప్రిల్ 27కంటే ముందే ఉంటుందిని కూడా సమాచారం. మరి నిజంగా విడుదల తేదీని మారుస్తారా, మారితే కొత్త తేదీ ఏమిటనేది తొందర్లోనే తేలిపోనుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు